అవి .. కేవలం పాటలు కావేమో...!! -
| తొలకరి చినుకులు
మది పుడమి పైని
సువాసనల అత్తరులు
కవి భావుకతను కళ్ళముందు
సృజియించే ఛాయా చిత్రాలు |
|| కావు .. అవి కేవలం పా..టలు ||
| అవి .. సజీవంగా విని ...
సగర్వంగా చెప్పుకోగలిగిన
సమకాలీనులు -
ఆ స్వరామృత బిందువులను
ఆస్వాదించే అజరామరులు -
.. ఆ అందరి తరపున నా నీరాజనాలు |