Thursday, February 14, 2008

ఉవాచ (వేలెంటైన్ డే కోట్)



అమ్మాయిలను

చుడడం వరకూ ఫర్వాలేదు

గాని,

చూపులు -

ఎదురు చూపులుగా

మారితేనే ప్రమాదం !!

అతడు - ఆమె



కనులు కనులను కలుస్తాయి..
మౌనంగా
మోహనంగా..!
భువిలో మాట్లాడని భాషని
మూగగా మాట్లాడుకుంటూ..,
పండిన పనసకాయలాంటి
పరిమళమేదో చుట్టుముడుతుండగ ..
వింతయై కవ్వింతగా
తమకు తెలియని భావమేదో
దాక్కునుందని
పరువపు పరదాల చాటునుంచి
హేమంత పవనాల
రాయభారం నెరపుచూ ..

భువిపై -
అనంద సామ్రాజ్యపు
నేతలిరువు ఎదురైనట్లు
గంభీరంగా..
చిలిపిగా..,
అంతలొనే తత్తరపడుచు మార్చే చూపులు -
ప్రణయ సమ్రాజ్య స్థాపనకునంది పలుకుచు ..
సమీరాల చాటుగ
కరములు కలిపి ..
స్వప్న వసంతాలు పూయగ ..
అతడు - ఆమె !!

Thursday, February 7, 2008

ఓటమి



గుండె చప్పుడుకు కర్ఫ్యూ విధించాలని
ఎర్ర సైన్యం - మనసు గోతుల్లోంచి
గొంతు లోయల్లోంచి అరుస్తోంది

ఆవేశంతో పెగలే గొంతును
ఖాకీల రూపం కోసేసింది

బిగిసిన కండకు
పిచ్చోళ్ళ అధికారం బల్లెపు పోటు పొడిచింది

ముందుకు నడిపించే గుండెని
స్వంతవాళ్ళ స్వార్ధం చిల్లులు చేసింది

ప్రతిచోటా - అన్యాయం
నా వెన్ను విరగ్గొట్టాలని చూస్తోంది

నా ఒక్కడి శక్తీ ..
స్రవిస్తూ ఇగిరిపొతోంది

అలోచనలకు మతిమరుపొస్తోంది
అలసిపోతున్నాను

ఎదురు తిరిగే చేవ చచ్చింది
అందుకే అంటున్నా -
గుండే ..! కసేపాగిపో........

Wednesday, February 6, 2008

నువ్వక్కడున్నా ..

నువ్వు అక్కడున్నావ్

నీ జ్ఞాపకం ఇక్కడుంది -

నాలో నిలువెత్తున అల్లుకుని

ఈ పరిసరల్లో దాక్కుని

నిశ్శబ్ధంలోనూ

నిర్ణిద్రలోనూ

కలకలం రేపుతూ ..

నాలో .. నా ఆలోచనల్లో

ఇంకా .. అంతఃచేతనలో

అనంత వ్యాప్తమై -- !

(10:25pm 6/10/2003)