కనులు కనులను కలుస్తాయి..
మౌనంగా
మోహనంగా..!
భువిలో మాట్లాడని భాషని
మూగగా మాట్లాడుకుంటూ..,
పండిన పనసకాయలాంటి
పరిమళమేదో చుట్టుముడుతుండగ ..
వింతయై కవ్వింతగా
తమకు తెలియని భావమేదో
దాక్కునుందని
పరువపు పరదాల చాటునుంచి
హేమంత పవనాల
రాయభారం నెరపుచూ ..
భువిపై -
అనంద సామ్రాజ్యపు
నేతలిరువు ఎదురైనట్లు
గంభీరంగా..
చిలిపిగా..,
అంతలొనే తత్తరపడుచు మార్చే చూపులు -
ప్రణయ సమ్రాజ్య స్థాపనకునంది పలుకుచు ..
సమీరాల చాటుగ
కరములు కలిపి ..
స్వప్న వసంతాలు పూయగ ..
అతడు - ఆమె !!
No comments:
Post a Comment