Wednesday, February 6, 2008

నువ్వక్కడున్నా ..

నువ్వు అక్కడున్నావ్

నీ జ్ఞాపకం ఇక్కడుంది -

నాలో నిలువెత్తున అల్లుకుని

ఈ పరిసరల్లో దాక్కుని

నిశ్శబ్ధంలోనూ

నిర్ణిద్రలోనూ

కలకలం రేపుతూ ..

నాలో .. నా ఆలోచనల్లో

ఇంకా .. అంతఃచేతనలో

అనంత వ్యాప్తమై -- !

(10:25pm 6/10/2003)

2 comments:

Srini said...

చందూ, ఇది విరహమా లేక ఎడబాటా? మొత్తానికి చాలా చిన్న కవితలో చక్కగా నీ భావాన్ని వివరించావు, ఇంకా ఎన్నో ఇలాంటి కవితలను నీ నుంచి ఆశిస్తున్నాను.

రాధిక said...

చాలా బాగుందండి.