Thursday, February 14, 2008
అతడు - ఆమె
కనులు కనులను కలుస్తాయి..
మౌనంగా
మోహనంగా..!
భువిలో మాట్లాడని భాషని
మూగగా మాట్లాడుకుంటూ..,
పండిన పనసకాయలాంటి
పరిమళమేదో చుట్టుముడుతుండగ ..
వింతయై కవ్వింతగా
తమకు తెలియని భావమేదో
దాక్కునుందని
పరువపు పరదాల చాటునుంచి
హేమంత పవనాల
రాయభారం నెరపుచూ ..
భువిపై -
అనంద సామ్రాజ్యపు
నేతలిరువు ఎదురైనట్లు
గంభీరంగా..
చిలిపిగా..,
అంతలొనే తత్తరపడుచు మార్చే చూపులు -
ప్రణయ సమ్రాజ్య స్థాపనకునంది పలుకుచు ..
సమీరాల చాటుగ
కరములు కలిపి ..
స్వప్న వసంతాలు పూయగ ..
అతడు - ఆమె !!
Thursday, February 7, 2008
ఓటమి
గుండె చప్పుడుకు కర్ఫ్యూ విధించాలని
ఎర్ర సైన్యం - మనసు గోతుల్లోంచి
గొంతు లోయల్లోంచి అరుస్తోంది
ఆవేశంతో పెగలే గొంతును
ఖాకీల రూపం కోసేసింది
బిగిసిన కండకు
పిచ్చోళ్ళ అధికారం బల్లెపు పోటు పొడిచింది
ముందుకు నడిపించే గుండెని
స్వంతవాళ్ళ స్వార్ధం చిల్లులు చేసింది
ప్రతిచోటా - అన్యాయం
నా వెన్ను విరగ్గొట్టాలని చూస్తోంది
నా ఒక్కడి శక్తీ ..
స్రవిస్తూ ఇగిరిపొతోంది
అలోచనలకు మతిమరుపొస్తోంది
అలసిపోతున్నాను
ఎదురు తిరిగే చేవ చచ్చింది
అందుకే అంటున్నా -
గుండే ..! కసేపాగిపో........
Wednesday, February 6, 2008
నువ్వక్కడున్నా ..
Subscribe to:
Posts (Atom)